నిడదవోలు మాజీ టీడీపీ ఎమ్మెల్యే వారి బ్యాచ్ స్టువర్టుపురం గ్యాంగ్
- చంద్రబాబు ఇసుక ఉచితంగా ఇస్తే అమ్ముకొని 150 కోట్లు సంపాదించాడు
- 2009, 2014 ఎలక్షన్స్ లో నా సంపాదన ఈ మూర్ఖుడికే ఇచ్చాను
- ఉమ్మడి అభ్యర్థి కందుల దుర్గేష్ ను గెలిపిస్తాడా? ఓడిస్తాడా?
- నియోజకవర్గం లో ఏం జరుగుతుందో ఇంటిలిజెంట్ రిపోర్ట్ నాకు తెలుసు
- అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉన్న
- అధిష్టానం నుంచి ఆదేశం వచ్చాక కార్యచరణ వివరిస్తా
- ఉమ్మడి అభ్యర్థి కందుల దుర్గేష్ గెలుపుకు కృషి చేస్తా
కార్యకర్తల సమావేశంలో టిడిపి మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు పై కుందుల సత్యనారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు
ఏపీ పబ్లిక్ న్యూస్, 28 మార్చ్ 2024
నిడదవోలు నియోజకవర్గం పెండ్యాల : మా కుటుంబం అంతా చాలా కష్టపడి వృద్ధి లో వచ్చాము, ఆర్థికంగా కూడా అంతా స్థిరపడ్డాం, గత 20 సం" నుండి తెలుగుదేశం పార్టీ కి విధేయుడు గా ఉన్నా, 2024 ఎలక్షన్స్ కి చంద్రబాబు, లోకేష్ నాకు టికెట్ ఇస్తానని హామీ ఇచ్చారు. ఆసక్తి లేకున్నా ప్రజలకు సేవచేయడానికి పోటీ చేయాలనుకున్న, కాని కూటమి నిర్ణయాలలో నిడదవోలు టికెట్ జనసేన ఇస్తున్నాం అని లోకేష్ బాబు నాకు ఫోన్ చేసి చెప్పారు అప్పుడు ఆ విషయం మీతో పంచుకోలేదు. అధిష్టాన నిర్ణయాన్ని ఎప్పుడు వ్యతిరేకించినని, తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు విధేయుడుగా ఉంటానని, అభ్యర్థి ఎవరైనా తెలుగుదేశం గెలుపు కోసం కృషి చేస్తానని ఆ రోజు చంద్రబాబు, లోకేష్ లకు తెలియజేశాను అన్నారు. అధిష్టానం నుంచి కొన్ని రోజుల తర్వాత ఆదేశాలు వస్తాయని, త్వరలోనే కార్యచరణ వివరిస్తానని, మనమందరం ఉమ్మడి అభ్యర్థిని కందుల దుర్గేష్ ను గెలిపించుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
నిడదవోలు తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు వారి బ్యాచ్ స్టువర్టుపురం గ్యాంగ్
మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు తనపై చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి 2009, 2014 ఎలక్షన్స్ లో నా సంపాదన ధారపోసానని, నేను ఇసుకను ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఇసుక వ్యాపారం చేశాను. మాజీ ఎమ్మెల్యే నా వద్ద కొన్ని వేల లారీలు తీసుకెళ్లి లారీ ఇసుక 20 వేలకు కొమ్ముకుని 150 కోట్లు సంపాదించాడు. ఈ మాజీ ఎమ్మెల్యే, వాళ్ళ బ్యాచ్ స్టువర్టుపురం గ్యాంగ్ అని, ఈ మాజీ ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి అయిన కందుల దుర్గేష్ ను గెలిపించాలని అనుకుంటున్నారా? ఓడించాలని అనుకుంటున్నారా? అన్నది నియోజకవర్గం ఇంటిలిజెన్స్ రిపోర్ట్స్ తన వద్దకు వచ్చాయని అన్నారు.