గాజు గ్లాజుకు ఓటేయ్యండి - ప్రచారం విస్తృతం చేసిన కూటమి

గాజు గ్లాజుకు ఓటేయ్యండి - ప్రచారం విస్తృతం చేసిన కూటమి


ఇద్దరు ఎమ్మెల్యేలు సేవ చేస్తాం

ఒకరు నేనైతే... మరొకరు శేషారావు 

ఆత్మీయ సమావేశాలలో కందుల దుర్గేష్

ప్రచారం విస్తృతం చేసిన కూటమి

ఏపీ పబ్లిక్ న్యూస్, నిడదవోలు మార్చి 23: నిడదవోలు తెలుగుదేశం, జనసేన, బిజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్ధి, జనసేన తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కందుల దుర్గేష్ నిడదవోలు ప్రజలకు బంఫర్ ఆఫర్ ఇచ్చారు. తనకు ఓటేస్తే ఇద్దరు ఎమ్మెల్యేలు పనిచేస్తారని ఆయన అన్నారు .నిడదవోలులోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటానని చెప్పారు. మీకందరికీ అందుబటులో వుంటానని, మీ సమస్యలు పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని దుర్గేష్ తెలిపారు. అందరికీ ఒక్కటే చెబుతున్నా.. గాజు గ్లాసుకు ఓటేస్తే మీకు ఇద్దరు ఎమ్మెల్యేలు సేవలు చేస్తారని అందులో ఒకరు మీకు సుపరిచితులు, మీకెంతో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా సేవలు అందించిన బూరుగుపల్లి శేషారావు, మరో ఎమ్మెల్యేగా నేను కలిసి ఇద్దరు ఎమ్మెల్యేలు గా మీకు సేవలు అందిస్తామని అన్నారు. నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బిజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్ధి, జనసేన తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ తన ఎన్నికల ప్రచారాన్ని విస్తృతం చేశారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను చుట్టి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్ధేశం చేసే కార్యక్రమాలను మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి నేతృత్వంలో గత రెండు రోజులుగా చేపట్టారు. తెలుగుదేశం నిడదవోలు ఇన్ ఛార్జి, మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, జనసేన నిడదవోలు ఇన్ ఛార్జి, ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ లతో కలిసి గురువారం ఉండ్రాజవరం మండలం లోని పలు గ్రామాలలో తెలుగుదేశం, జనసేన, బిజేపీ ఉమ్మడి నాయకులతో కందుల దుర్గేష్ పరిచయ సమావేశాలు నిర్వహించారు. బూరుగుపల్లి శేషారావు ముందుండి దర్గేష్ ప్రచార సరళిని నడిపిస్తున్నారు. పార్టీ మండల, గ్రామ స్థాయి నాయకులను దుర్గేష్ కు పరిచయం చేస్తూ, కూటమి అభ్యర్ధి కందుల దుర్గేష్ ను గెలిపించుకోవలసిన బాధ్యత అందరిపైనా వుందని బూరుగుపల్లి విజ్నప్తి చేస్తున్నారు. , తెలుగుదేశం, జనసేన, బిజేపీ నాయకులకు ఐక్యంగా దుర్గేష్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడానికే మనమందరం రంగంలోకి దిగామనే విషయాన్ని మరిచిపోవద్దని బూరుగుపల్లి శేషారావు పలు సభలలో్ స్పష్టం చేశారు. మనం విజయం సాధించుకోకపోతే మన భవిష్యత్ మరో ఐదేళ్లు అగమ్యగోచరం అవుతుందనే విషయాన్ని అందరూ దృష్టిలో వుంచుకుని ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్ధి విజయం కోసం పనిచేయాలని అన్నారు. ఉండ్రాజవరం మండలంలో గురువారం ఉదయం కాల్ధారి, చిలకలపాడు, మోర్త, దమ్మెను, గ్రామాలలో వరుసగా తెలుగుదేశం, జనసేన, బిజేపీ నాయకులు,కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. అన్ని చోట్లా కూడా ఉత్సాహంగా పెద్ద సంఖ్యలో తెలుగుదేశం, జనసేన, బిజేపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. మేమంతా కలిసివస్తున్నామని, మనం గెలుస్తానం అనే నినాదంతో దుర్గేష్, బూరుగుపల్లి, ప్రసాద్ లు ముందుగు సాగుతున్నారు. ఈ ఆత్మీయ సమావేశాలలో మండల టిడిపి, జనసేన నాయకులు రామకృష్ణ, సుబ్బారావు, సర్పంచ్ కుమారి, వీరమళ్ల బాలాజీ, రమేష్, ఆదినారాయణ, సత్యనారాయణ తదితరులు పాల్లొన్నారు. ప్రతి గ్రామంలోనూ కార్యకర్తలు దుర్గేష్ , బూరుగుపల్లి, ప్రసాద్ లకు ఘన స్వాగతం పలికారు.. నిడదవోలు మండలంలో.... గురువారం సాయంత్రం నిడదవోలు రూరల్ మండలంలోని పలు గ్రామాలలో తెలుగుదేశం, జనసేన, బిజేపీ ఉమ్మడి అభ్యర్ధి కందుల దుర్గేష్ ఎన్నికల ప్రచార ఆత్మీయ సమావేశాలలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, జనసేన ఇన్ ఛార్జి బివిఎస్ ఎన్ ప్రసాద్ లు అట్లపాడు, శమిశ్రగూడెం గ్రామాలలో జరిగిన ఆత్మీయ సమావేశాలలో పాల్గొన్నారు. పార్టీ నాయకులను దుర్గేస్ కు పరిచయం చేశారు. కూటమి అభ్యర్ధిని అఖండ మెజారిటీతో గెలిపించాలని బూరుగుపల్లి శేషారావు విజ్నప్తి చేశారు.