గౌరీపట్నం నిర్మలగిరి మేరీ మాత మహోత్సవాలు ప్రారంభం
ఏపీ పబ్లిక్ న్యూస్ : 2024 మార్చ్ 18, తూర్పు గోదావరి జిల్లా
గౌరీపట్నం నిర్మలగిరి మేరీ మాత మహోత్సవాలను మేరీ మాత పతకాన్ని ఎగరవేసి ఉత్సవాలను ప్రారంభించి భక్తులను ఆహ్వానించిన పీఠాధిపతులు మోస్ట్ రెవ. డా. జయరావు పొలిమేర ( ఏలూరు మేత్రాసనము ).
గౌరీపట్నం నిర్మలగిరి మేరీమత మహోత్సవాలు మార్చి 22,23,24,25 తేదీలలో ఘనంగా నిర్వహిస్తారని, మార్చి 16 నుండి 24 వరకు నవదిన ప్రార్థన మరియు పూజలు, ప్రతిరోజు సాయంత్రం 6 గం'' నుండి జపమాల ధ్యానం నిర్వహిస్తారని, ఈ పర్వదినాలలో లక్షలాదిగా భక్తులు నిర్మలగిరి మేరీమాతను దర్శించి ధరిస్తారని నిర్మలగిరి పుణ్యక్షేత్రం డైరెక్టర్ & విచారణ కర్త రెవ. ఫా. యస్ జాన్ పీటర్ మీడియకు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో పలువురు గురువులు, భక్తులు పాల్గొన్నారు.