వైసీపీ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించిన నిడదవోలు ఎమ్మెల్యే

వైసీపీ నియోజకవర్గ స్థాయి సమావేశం  నిర్వహించిన నిడదవోలు ఎమ్మెల్యే 




ఏపీ పబ్లిక్ న్యూస్, జనవరి 26 :  నిడదవోలు పట్టణం రోటరీ ఫంక్షన్ హాల్ నందు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులతో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొన్న నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు జి.శ్రీనివాస్ నాయుడు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ జగనన్న ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిననాటి నుండి ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడమే కాకుండా, అన్ని నియోజకవర్గాలతో పాటు నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారన్నారు. నిడదవోలులో ఆర్వోబి నిర్మాణానికి 200 కోట్లు కేటాయించారన్నారు. రోడ్లు అభివృద్ధికి సుమారుగా 130 కోట్లు, ఇంటింటికి కుళాయి ఏర్పాటుకు 83 కోట్లు కేటాయించమన్నారు. ఎన్నడూ లేని విదంగా పెరవలి ఉండ్రాజవరం మండలాల్లో అరటి రైతులకు ఇన్సూరెన్సు ఇప్పించమన్నారు.

2019 ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం, ముఖ్యమంత్రి అయ్యాకా అన్ని పధకాలు అమలు చేసిన దమ్మున్న నాయకుడు మన జగనన్న అని తెలిపారు. పాఠశాలలు, ఆసుపత్రిలు అభివృద్ధి చేశామన్నారు. నియోజవర్గానికి సంక్షేమ పథకాల నిమిత్తం సుమారుగా 1350 కోట్లు, అభివృద్ధి కార్యక్రమాలు నిమిత్తం 670 కోట్లు జగనన్న కేటాయించారాన్నారు. రాబోయే 2024 ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి ని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవలసిన భాద్యత మనందరి మీద ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ రాష్ట్ర,జిల్లా,మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు, రాష్ట్ర డైరెక్టర్లు, జె.సి.యస్. ఇంచార్జులు, ట్రస్ట్ బోర్డు మెంబర్లు పాల్గొన్నారు.