దీపావళి సందర్భంగా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించిన నిడదవోలు ఎస్సై పి.నాగరాజు

 దీపావళి సందర్భంగా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించిన నిడదవోలు ఎస్సై పి.నాగరాజు




ఏపీ పబ్లిక్ న్యూస్, నిడదవోలు నవంబర్ 09 : దీపావళి పండుగ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న బాణాసంచా దుకాణం దారులు లైసెన్స్ కలిగి ఉండాలని పోలీస్, రెవెన్యూ, ఫైర్ సిబ్బంది సూచించిన స్థలంలోనే దుకాణాలను ఏర్పాటు చేయాలని దుకాణం దారులు అన్ని జాగ్రత్తలతో, నిబంధనలను అనుసరించి దుకాణాలను ఏర్పాటు చేసుకోవాలని, అటువంటి చోటనే ప్రజలు బాణాసంచి కొనుగోలు చేయాలని ఎస్సై తెలిపారు. ఏటువంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా భద్రతతో బాణాసంచా కాల్చే వారు కాటన్ దుస్తులను ధరించాలని, తల్లిదండ్రుల పర్యవేక్షణలో చిన్నపిల్లలు బాణాసంచా కాల్చేలా చూసుకోవాలని నిడదవోలు టౌన్ ఎస్సై పి.నాగరాజు తల్లిదండ్రులకు సూచించారు. పండుగ సమయంలో మద్యం సేవించి వాహనాలతో యువత విన్యాసాలు గాని, ప్రజలకు ఇబ్బంది కలిగేలా గుంపులుగా రోడ్లపై ఎక్కడైనా బాణసంచా కాల్చడం లాంటివి చేస్తే కఠినంగా శిక్షించబడతారని హెచ్చరించారు. ఈ దీపావళి పండుగను ప్రజలంతా సంతోషంగా చేసుకోవాలని నిడదవోలు ఎస్సై పి.నాగరాజు ఆకాంక్షించారు.