మౌలిక సదుపాయాల పై సత్వర చర్యలు
వార్డు పర్యటనలో చందన నాగేశ్వర్ నిర్థారణ
సమస్యలపై క్షేత్రస్థాయి సమీక్ష..
ఏపీ పబ్లిక్ న్యూస్, రాజమండ్రి, అవరోడ్డు, నవంబర్-03
వైఎస్ఆర్సిపి రాష్ట్ర పచ్చదనం మరియు సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ మరియు రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్ స్థానిక ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు, వీరభద్ర నగర్ లో పర్యటిస్తూమౌలిక సమస్యలను గురించి స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈస్ట్ రైల్వేస్టేషన్ రోడ్డు వీరభద్ర నగర్ లో 30 అడుగుల రోడ్డులో 15 అడుగులు రోడ్డును వదిలేసి 15 అడుగులఅండర్ గ్రౌండ్ డ్రైనేజీ త్రవ్వి అలాగే వదిలేయడం వల్ల స్థానికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న చందన్ నాగేశ్వర్ సంబంధిత అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.
అక్కడ తవ్విన డ్రైనేజీలో పది అడుగులు నీరు నిల్వ ఉండటం వల్ల అక్కడ తీవ్రమైన దుర్గంధంతో, విపరీతమైన దోమలతో స్థానిక మహిళలు ఫిర్యాదు చేశారు. రైల్వే మెమో కార్ షీట్ గోడ పక్కన ఉన్న డ్రైనేజ్ మూసి వేయడం వల్ల ఆ మురిగి నీరు బయటకు పోవటానికి దారి లేదని స్థానికులు ఫిర్యాదు చేశారు .
రైల్వే అధికారులతో పలు డ్రైనేజీ సమస్యలను పరిష్కరించేందుకు క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీ.సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాలిక శ్రీను , రూపేష్ చంద్ర, ఈశ్వర్, జి రమణ, అర్జున్, కే నాని, ప్రకాష్, వి లక్ష్మి, ఏ లక్ష్మి, జి కుమారి, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.