నాతో మీరు సిద్ధమేనా?!
'గో గ్రీన్ ఛాలెంజ్' చేస్తున్న క్రికెట్ ఆటగాడు అంబటి రాయుడు
నేడు రాజమండ్రి తిలక్ రోడ్డులో ఎంపీ భరత్ ఆధ్వర్యంలో యువతా హరితా కార్యక్రమం
ఏపీ పబ్లిక్ న్యూస్, రాజమండ్రి, నవంబరు 2: రాజమండ్రి నగరంలో ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 'యువత హరిత' (గో గ్రీన్ ఛాలెంజ్) కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇండియన్ టీమ్ టాప్ ఆర్డర్ క్రికెట్ ఆటగాడు అంబటి రాయుడు నగరానికి వస్తున్నారు. నగరంలోని తిలక్ రోడ్డులో శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో యువతను, విద్యార్థులను హరిత విప్లవంపై చైతన్యం చేసేందుకు క్రికెట్ ప్లేయర్ అంబటి వస్తున్నారని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు. నగరంలో పచ్చదనం అలుముకునేలా, సహజ సిద్ధమైన గాలిని నగర వాసులు పీల్చుకునేలా చేయడం యువత-హరిత కార్యక్రమం ముఖ్య లక్ష్యమని అన్నారు. నగరానికి చెందిన యువత, విద్యార్థులు, నగర వాసులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఎంపీ భరత్ పిలుపునిచ్చారు.