బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో గోపవరంలో భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమం
ఏపీ పబ్లిక్ న్యూస్, నిడదవోలు, నవంబర్ 29 : తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి కార్యాచరణ లో భాగంగా నిడదవోలు మండలం గోపవరం గ్రామంలో భవిష్యత్ కు గ్యారంటీ అనే కార్యక్రమంలో ఇంటి ఇంటికి వెళ్లి ప్రచారం చేసి ప్రజా వేదిక నిర్వహించిన నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి బూరుగుపల్లి శేషారావు, నిడదవోలు మండల జనసేన పార్టీ అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిడదవోలు మండల తెలుగుదేశం పార్టీ అద్యక్షులు వెలగన సూర్య రావు, గోపవరం సర్పంచ్ అరేపల్లి భాగ్యలక్ష్మి, జనసేన పార్టీ నాయకులు కోటిపల్లి మురళీకృష్ణ, నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.