నిమిషాల్లో పెన్షన్ మంజూరు చేయించిన రూడా చైర్మన్ మేడపాటి షర్మిళ రెడ్డి
ఏపీ పబ్లిక్ న్యూస్ , రాజమహేంద్రవరం : మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల కొత్తగా మంజూరు కాబడిన, పెంపుదల చేసిన వైఎస్సార్ ఫించను కానుక పంపిణీ కార్యక్రమానికి రుడా చైర్పర్సన్ శ్రీమతి మేడపాటి షర్మిళ రెడ్డి వెళ్లినప్పుడు అక్కడ ఉన్న ఒక పెద్ద ఆమె షర్మిళ రెడ్డి ని చూసి చూడగానే దగ్గరకు వెళ్లి నాకు పింఛను ఇప్పించమని అడిగిన వెంటనే రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కే.దినేష్ కుమార్ IAS తో మాట్లాడి ఆ పెద్దమ్మ కు ఫించను మంజూరు చేయడంతో పాటు ఈ నెల పెన్షన్ ఇప్పించారు. పెద్దమ్మ కు పెన్షన్ మంజూరు అవ్వడం తో ఆమె కళ్ళల్లో ఆనందం చూసి రూడా చైర్మన్ మేడపాటి షర్మిళ రెడ్డి ఎంతో ఆనందం పొందానని మీడియా కి తెలియచేశారు.