పెన్షన్ పెంచుతున్నట్లు ప్రకటించి మరో వైపు నిబంధనలు పేరుతో కుదించటం నోటి దగ్గర కూడు లాక్కోవటమే

పెన్షన్ పెంచుతున్నట్లు ప్రకటించి మరో వైపు నిబంధనలు పేరుతో కుదించటం నోటి దగ్గర కూడు లాక్కోవటమే 


సీపీఎం తూర్పు గోదావరి జిల్లా నాయకులు  జువ్వల రాంబాబు

నిడదవోలు, ఏపీ పబ్లిక్ న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు నిబంధనల పేరుతో సామాజిక పెన్షన్లు, రేషన్ కార్డులు, అక్రమంగా రద్దు చేస్తే ప్రజలతో రోడ్డెక్కి ఆందోళన చేస్తామని సీపీఎం తూర్పు గోదావరి జిల్లా నాయకులు జువ్వల రాంబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈరోజు నిడదవోలు సీపీఎం కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో రాంబాబు మాట్లాడుతూ నిబంధనల పేరుతో ప్రతి జిల్లాలో 10వేల సామాజిక పెన్షన్లు రద్దు చేసేందుకు లబ్దిదారులకు నోటీసులు జారీ చేశారని ప్రతి సచివాలయం పరిధిలో 20నుండి 30వరకు పెన్షన్లు రద్దు చేసేందుకు రంగం సిద్దం అయినట్లు రాంబాబు తెలిపారు. ఒక వైపు పెన్షన్ పెంచుతున్నట్లు ప్రకటించి మరో వైపు నిబంధనలు పేరుతో కుదించటం నోటి దగ్గర కూడు లాక్కోవటమే అని రాంబాబు విమర్శించారు. ఇదేనా సంక్షేమం అని ప్రశ్నించారు. 300యూనిట్లకు పైన విద్యుత్, వెయ్యి చదరపు అడుగుల స్థలంలో ఇంటి నిర్మాణం, నాలుగు చక్రాల వాహనం బాడుగ తిప్పుకోవటానికి కొన్నా పెన్షన్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించటం అన్యాయమన్నారు. ఇప్పటికే వంట గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగినందున ఈ స్థితిలో రద్దు చెయ్యటం పేదలపై మరింత భారం పడుతుందన్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేనిచో ఆందోళనకు పూనుకుంటామన్నారు.