ప్రపంచ శాంతికి క్రీస్తు బోధనలు అనుసరణీయం

ప్రపంచ శాంతికి క్రీస్తు బోధనలు అనుసరణీయం

వైసీపీ పార్లమెంటరీ కార్యాలయంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో ఎంపీ భరత్


ఏపీ పబ్లిక్ న్యూస్, రాజమండ్రి : త్యాగానికి, ప్రేమకు ప్రతీక ఏసు..ఆయన బోధనలు ప్రపంచ శాంతికి ఎంతగానో దోహదపడతాయని వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. ఆదివారం రాత్రి నగరంలోని వీఎల్ పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలోని ఎంపీ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ మార్గాని భరత్ రామ్ ముఖ్య అతిథిగా విచ్చేసి క్రిస్మస్ కేక్ కట్ చేశారు. పార్టీ శ్రేణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ తాను నమ్మిన మార్గం కోసం, తనను విశ్వసించిన వారి కోసం యుక్త వయస్సులోనే ప్రాణాలను సైతం అర్పించిన‌ ప్రభువు ఏసు త్యాగం వృధా కారాదని, ఆయన బోధనలు శిరోధార్యంగా స్వీకరించాలన్నారు. ప్రేమ, దయ, త్యాగాలకు మరో పేరు క్రీస్తు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి నగర పార్టీ అధ్యక్షుడు అడపా శ్రీహరి అధ్యక్షత వహించగా, విశిష్ట అతిథిగా రుడా ఛైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, వైసీపీ నేతలు అన్నపూర్ణ రాజు, పోలు విజయలక్ష్మి, సంకిస భవానీ ప్రియ తదితరులు పాల్గొన్నారు. ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అంతకుముందు ఎంపీ భరత్ నగరంలోని పలు చర్చిలలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక అశోకా థియేటర్ వద్ద మజ్జి అప్పారావు ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో ఎంపీ పాల్గొన్నారు. అలాగే జాంపేట చర్చిగేట్ సెంట్ ఫైల్స్ లూథరన్ చర్చి, మోరంపూడి శ్రీలక్ష్మీ నగర్ యేసయ్య ఆశీర్వాద ప్రార్థనా మందిరం తదితర చర్చిలలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో పాల్గొని క్రైస్తవ భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ‌అనంతరం ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానంలో స్టార్ నైట్ కార్యక్రమంలో ఎంపీ భరత్ పాల్గొన్నారు. అలాగే వీఎల్ పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రాయల్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ను ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.