సెయింట్ పాల్ లూథరన్ చర్చి క్రిస్మస్ వేడుకలో పాల్గొన్న హోం మంత్రి తానేటి వనిత

సెయింట్ పాల్ లూథరన్ చర్చి క్రిస్మస్ వేడుకలో పాల్గొన్న హోం మంత్రి తానేటి వనిత




ఏపీ పబ్లిక్ న్యూస్, కొవ్వూరు: కొవ్వూరు లోని క్రిస్టియన్ పేటలో క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ క్రిస్మస్ వేడుకలకు హోం మంత్రి తానేటి వనిత ముఖ్యఅతిథిగా విచ్చేశారు. సెయింట్ పాల్ లూథరన్ చర్చి ఆధ్వర్యంలో జరిగిన ఈ సెలబ్రేషన్స్ కు చర్చ్ సంఘ సభ్యులు, కొవ్వూరు వైస్సార్సీపీ నాయకులు, మహిళా నేతలు, క్రైస్తవ సోదరీ సోదరీమణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రపంచానికి ప్రేమ మార్గాన్ని చూపించిన గొప్ప దేవుడు యేసు ప్రభువని హోం మంత్రి వనిత అన్నారు. యేసుక్రీస్తు పుట్టిన రోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ ఎదుటివారి పట్ల దయ, కరుణలతో వ్యవహరించాలన్నారు. క్రిస్మస్ వేడుకలను సెయింట్ పాల్ లూథరన్ చర్చ్ లో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని హోంమంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.