రైల్వే గేటు మూసివేత - ప్రజా ప్రతినిధులే ప్రజల ఇబ్బందికి కారణం
ఏపీ పబ్లిక్ న్యూస్ : తూర్పు గోదావరి జిల్లా
తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం సింగవరం... నిడదవోలు.. తాడేపల్లి గూడెం రైల్వే గేట్ ఈనెల 21నుండి 30వ తేదీ వరకు మరమ్మత్తుల నిమిత్తం మూసివేస్తున్న సందర్భంగా వాహన దారులు ప్రయాణికులుచాలా ఇబ్బందులు ఎదుర్కొపోతున్నారు. అధికారులు ప్రజా ప్రతినిధులు కు ముందు చూపు లేక పోవటమే దీనికి కారణం అని సీపీఎం నాయకులు జువ్వల రాంబాబు విమర్శించారు ఈరోజు సింగవరం.. తాళ్ళపాలెం రైల్వే ఓవర్ బ్రిడ్జి క్రింది రోడ్ పెద్ద పెద్ద గొయ్యలతో. ప్రయాణించే అవకాశం లేుండాపోయింది. రోడ్డును వెంటనే మరమ్మత్తు చెయ్యాలని సీపీఎం ఆధ్వర్యంలో వంతెన వద్ద ధర్నా నిర్వహించారు రాంబాబు మాట్లాడుతూ 10రోజులు గేట్ ముయ్యటం వల్ల ఈ వంతెనే ప్రజలకు ఆధారం ఇది చాలా ప్రమాదకరంగా వుంది వర్షం వస్తే మొత్తం నిండిపోయి వాహన దారులు పడిపోతున్నారు. వెంటనే పంచాయితీ అధికారులు యుద్ద ప్రాతిపదికన రోడ్డు నిర్మించాలని రాంబాబు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో డొంకా రమేష్ తూరుగోపు నానీ నల్లా పండు.M దుర్గా ప్రసాద్ యేసు. ప్రేమ్. నాగరాజు తదితరులు పాల్గొన్నారు