ప్రభాస్ ''ఆదిపురుష్'' టీజర్ వ్యూస్ వరల్డ్ రికార్డు నమోదు
ఏపీ పబ్లిక్ న్యూస్ : సినిమా
ఆదిపురుష్ టీజర్ అనేక విమర్శలను ఎదుర్కొంది. వీఎఫ్‌ఎక్స్ విషయంలో దారుణమైన ట్రోల్స్ కి గురైంది. అయినా తన సత్తాని చాటారు ప్రభాస్. టీజర్ రికార్డు వ్యూస్‌ని దక్కించుకుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి తన సత్తా చాటుతున్నారు. ఆయనపై ఎన్ని ట్రోల్స్ కామెంట్లు వచ్చినా, తనేంటో నిరూపించుకున్నారు. `ఆదిపురుష్` చిత్రంతో తన ఇమేజ్‌ని చాటుకున్నారు. `ఆదిపురుష్` టీజర్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఆదివారం అయోధ్యలో భారీ ఈవెంట్ ఏర్పాటు చేసి ఆదిపురుష్ టీజర్‌ని విడుదల చేశారు.
దీనిపై ప్రారంభం నుంచి తీవ్రమైన విమర్శలొచ్చాయి. కార్టూన్ సినిమాలా ఉందని, యానిమేషన్స్ దారుణంగా ఉన్నాయని, రామాణయం నేపథ్యంలో సినిమా చేస్తా అని, మరో కొచ్చడయాన్ చేశాడని నెటిజన్లు కామెంట్లతో రెచ్చిపోయింది. సెటైర్లు పేలుస్తూ మీమ్స్, ట్రోల్స్ తో ఆడుకున్నారు. కార్టూన్ సినిమాలతో `ఆదిపురుష్` సినిమా పోటీ పడుతుందని, చిన్న పిల్లల సినిమా అంటూ దారుణమైన ట్రోల్స్ వచ్చాయి.
క్రిటిక్స్ నుంచి, అభిమానుల వరకు `ఆదిపురుష్` టీజర్ పై అసంతృప్తిని వ్యక్తం చేశారు. నెగటివ్ కామెంట్లు సోషల మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఇన్ని జరిగినా, ప్రభాస్ తన సత్తాని చాటుకున్నారు. తన స్టామినా ఏంటో నిరూపించుకున్నారు. తాజాగా `ఆదిపురుష్` టీజర్ రికార్డ్ వ్యూస్ సాధించింది. కేవలం 24గంటల్లోనే ఐదు భాషల్లో వంద మిలియన్స్ కిపైగా వ్యూస్‌ని రాబట్టింది.
యూట్యూబ్‌లోనూ ట్రెండ్ అవుతుంది. నెంబర్ వన్ పొజిషియన్‌లో ట్రెండ్ అవుతుంది. 1.5 మిలియన్స్ లైకులను సాధించింది. ప్రపంచంలోనే అత్యధిక మంది వీక్షించిన వీడియోగా ఇది రికార్డు సృష్టించింది. ఇప్పుడు మరిన్ని రికార్డుల దిశగా ముందుగా సాగుతోంది. ఇన్ని ట్రోల్స్ వచ్చినా ఈ స్థాయిలో వీక్షించడం అరుదైన విషయంగా చెప్పొచ్చు.
ఇక ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన `ఆదిపురుష్` రామాయణం ఆధారంగా తెరకెక్కించారు. రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటించారు. భారీ విజువల్ వండర్‌గా ఐదువందల కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఐమాక్స్, 3డీ వెర్షన్స్ లో విడుదల కాబోతుంది