పొలానికి అడ్డుగా వుందని అంబేద్కర్ విగ్రహం తొలగింపు
నిరసన తెలిపిన కుల వివక్ష పోరాట సమితి
యధా స్థానంలో విగ్రహాన్ని ప్రతిష్టించాలని డిమాండ్
ఏపీ పబ్లిక్ న్యూస్ : తూర్పు గోదావరి జిల్లా
కోరుమామిడి, తాడిమళ్ళలో పోడూరు మండలం కొమ్ముచిక్కాల గ్రామంలో భారత రత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని అధికారులు తొలగించటాన్ని కుల వివక్ష పోరాట సమితి తీవ్రంగా ఖండిస్తూ నిరసన తెలిపింది. ఈ సందర్భంగా KVPS జిల్లా ప్రధాన కార్యదర్శి జువ్వల రాంబాబు మాట్లాడుతూ... ఒక రైతు తన పొలానికి అడ్డుగా వుందని విగ్రహాన్ని తొలగించాలని హైకోర్టు నుండి తెచ్చుకున్న ఆర్డర్ ఆధారంగా ప్రభుత్వం అధికారులు, పోలీసుల సమక్షంలో తొలగించటం దారుణమన్నారు. చాలా మంది గ్రామం ఆధిపత్య కులాల వారు ప్రభుత్వ భూముల్ని గ్రామకంఠం భూముల్ని కబ్జా చేసి అనుభవిస్తున్న వారి జోలికి పోకుండా SCలను తక్కువుగా చూస్తూ నిరంకుశంగా వ్యవహరించటం అన్యాయం అన్నారు. ప్రభుత్వం దళితులతో చర్చించి ఆత్మ గౌరవం దెబ్బతినకుండా యధా స్థానంలో విగ్రహాన్ని ప్రతిష్టించాలని రాంబాబు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోరుమామిడి జైభీం సేన సభ్యులు ఈడూరి నాగేంద్ర, దాసి కృష్ణ రాజు, గారపాటి అప్పారావు, ఈడూరి సోమేశ్వర రావు, బడితి నవీన్ కుమార్, తాడిమళ్ళ యూత్, పెద్దలు పెండగంటి శ్రీనివాస రావు, కొండా నాగేశ్వర రావు, పంతగాని యోహాను, పెంటయ్య, హరిశ్చంద్ర, నానీ, మంగ రాజు, హర్ష కుమార్, మునేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు