రైస్ మిల్లుపై విజిలెన్స్ దాడి - 225 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం
వట్టిచెరుకూరు రైస్ మిల్లుపై విజిలెన్స్ దాడులు
ఏపీ పబ్లిక్ న్యూస్ : గుంటూరు జిల్లా
గుంటూరు జిల్లా...ప్రత్తిపాడు మండలం చమళ్ల మూడిలోని పద్మజా రైస్ మిల్లు పై సోమవారం విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన 225 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. గుంటూరులోని లాలాపేట ప్రాంతం నుంచి కిరాయి వ్యక్తుల ద్వారా బియ్యాన్ని సేకరించి, ఇక్కడ ప్యాకింగ్ మార్చి కాకినాడ, యానాo ప్రాంతాలకు తరలిస్తున్నారని అధికారులు తెలిపారు. మిల్లులో సివిల్ సప్లయిస్ కార్పోరేషన్ ముద్రవేసిన ఖాళీ బస్తాలను గుర్తించారు.