టిడ్కో ఇళ్ళు కాలనీల పనులు వెంటనే ప్రారంభించాలి - సిపిఎం నాయకులు జువ్వల రాంబాబు డిమాండ్
ఏపీ పబ్లిక్ న్యూస్ : తూర్పు గోదావరి జిల్లా
నిడదవోలు తీరుగుడెం టిడ్కో ఇళ్ళు ఈ డిసెంబర్ నెలలో నిడదవోలులో వున్న 1200మంది లబ్ధిదారులకు అందిస్తామన్న ప్రభుత్వం, అధికారుల హామీ ఒట్టి మోసపూరితమని సీపీఎం నాయకులు జువ్వల రాంబాబు ఆరోపించారు. డిసెంబర్ లో లబ్దిదారులకు అన్ని సౌకర్యాలతో అందిస్తామన్న అధికారులు ప్రజా ప్రతినిధుల ప్రకటనలతో లబ్దిదారుల్లో ఆశలు చిగురించాయి. ఏ మేరకు చర్యలు తీసుకుంటున్నారో సీపీఎం నాయకులు జువ్వలరాంబాబు పరిశీలించారు. రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చెయ్యటానికి ఒక్క ఇంచు కూడా ముందుకు వెళ్ళలేదు. ప్రజలు అడిగినప్పుడల్లా అదిగో ఇదుగో అంటూ రిజిస్ట్రేషన్ చేయించటం తర్వాత అటకెక్కించటం లబ్దిదారులకు చెవిలోపువ్వులు పెట్టి మరోసారి ప్రభుత్వం మోసం చేస్తోందని రాంబాబు విమర్శించారు. వెంటనే టిడ్కో ఇళ్ళు నిర్మాణ పనులు, మౌలిక సదుపాయాల పనులు వెంటనే ప్రారంభించాలని జువ్వల రాంబాబు డిమాండ్ చేశారు.