వీరికి టికెట్ ఇచ్చేది లేదు - 27మంది ఎమ్మెల్యేలపై జగన్ ఆగ్రహం
ఏపీ పబ్లిక్ న్యూస్ : అమరావతి
అమరావతి: ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, జిల్లా ఇన్‌ఛార్జిలతో సీఎం జగన్ భేటీ ముగిసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే నివేదికను సీఎం వెల్లడించారు.27 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని తెలిపారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో వారు సరైన పనితీరు కనబర్చలేదని సీఎం అసంతృప్తి వ్యక్తి చేసినట్టు సమాచారం. 27 మంది ఎమ్మెల్యేలు, మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం.. పనితీరు మెరుగు పర్చుకోవాలని ఆదేశించారు. లేని పక్షంలో చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. పనితీరు మార్చుకోకుంటే టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. నవంబరులో మరోసారి ఎమ్మెల్యేల పనితీరు సమీక్షిస్తానని, ఎన్నికలకు 6 నెలల ముందే సీటు ఇవ్వని వారి పేర్లు ప్రకటిస్తానని స్పష్టం చేశారు.