ఆజాదీ కా అమృత్ మహోత్సవం - ర్యాలీ నిర్వహించిన నిడదవోలు వార్డు కౌన్సిలర్స్
ఏపీ పబ్లిక్ న్యూస్ : తూర్పుగోదావరి జిల్లా
ఆజాదీ కా అమృత్ మహోత్సవం లో భాగంగా ది.02.08.2022 న మంగళవారం జాతీయ జెండా రూపకర్త అయిన శ్రీ.పింగళి వెంకయ్య గారి జన్మదినం పురస్కరించుకొని నిడదవోలు శాసనసభ్యులు జి. శ్రీనివాస్ నాయుడు ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ పర్యవేక్షణలో ఈ రోజు ఉదయం 10.30 గం.లకు బాలాజీ నగర్ సచివాలయం పరిధిలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 1వ వార్డు కౌన్సిలర్ గోపిరెడ్డి శ్రీనివాస్, 28వ వార్డ్ కౌన్సిలర్ ఆకుల ముకుందరావు, మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్, సచివాలయ సిబ్బంది మరియు వార్డు వాలంటీర్లలు అందరూ కలిసి పాల్గొన్నారు.