జనసేన తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ ను కొద్ది సేపటి కిందట పోలీసులు గృహనిర్బందం
ఏపీ పబ్లిక్ న్యూస్ : తూర్పుగోదావరి జిల్లా
జూలై 25 : జనసేన తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ ను కొద్ది సేపటి కిందట పోలీసులు గృహనిర్బందం చేశారని సమాచారం... మంగళవారం ఉదయం అంబేద్కర్ కోనసీమ జిల్లా లో రాష్ర్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తున్నారు.. ఈ పర్యటన లో తాము నిరసన వ్యక్తం చేస్తామని సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించి కందుల దుర్గేష్.. ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఈ ఈ నేపద్యంలోనే పోలీసులు జనసేన నాయకులు కందుల దుర్గేష్ ను గృహనిర్బందం చేశారని తెలిసింది.. సమాచారం తెలుసుకున్న పలువురు మీడియా ప్రతినిధులు కందుల దుర్గేష్ నివాసానికి చేరుకున్నారు.....