జగన్మోహన రెడ్డి పాలన పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం. సమస్యలను అడిగి తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కారానికి చర్యలు - రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్

జగన్మోహన రెడ్డి పాలన పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం. సమస్యలను అడిగి తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కారానికి చర్యలు - రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్



తూర్పుగోదావరి జిల్లా  : ఏపీ పబ్లిక్ న్యూస్

రాజమహేంద్రవరం : గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్. జగన్మోహన రెడ్డి పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. గురువారం నాడు ఐదవ రోజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సీనియర్ నాయకులు ముప్పన ప్రభాకర్ అధ్వర్యంలో 1 వ వార్డ్ లో 2 వ సచివాలయం పరిధిలో బత్తిన నగర్ పర్యటించారు. మొత్తం 180 ఇళ్లు, 280 మందికి పథకాల కర పత్రాలు లబ్ధిదారులకు స్వయముగా అందచేశారు. అలాగే ప్రతీ ఒక్కరినీ ప్రభుత్వం ఇచ్చిన సొమ్ము వాళ్ల ఖాతాలలో పడింది లేనిది అడిగి తెలుసుకున్నారు. అలాగే ఒన్ టైం సెటిల్మెంట్ (OTS) లబ్ధిదారులకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్లను అంద చేసిన ఎంపీ మార్గాని భరత్ రామ్. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు ద్వారా లబ్దిపొందిన వివరాలను తెలుపుతూ ప్రభుత్వ ముద్రించిన కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించారు.ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజల స్పందన తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ రామ్ మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో పేదరికమే అర్హతగా భావించి అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందన్నారు. కరోనా వంటి విపత్కర సమయంలో కూడా ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందించిన ఘనత వై.యస్ జగన్మోహన రెడ్డి గారికి దక్కుతుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించి లబ్ధిదారులకు నేరుగా అందుతున్నాయా లేదా? తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్,వసతి దీవెన కింద ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆర్థిక సహకారం అందించడం వల్లే ఒక్క రూపాయి కూడా అప్పు చేయకుండా పిల్లలను ఉన్నత చదువులు చదివించుకోగలిగామని ఆనందంతో ఎంపీ కి ప్రజలు తెలిపారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో ఏ గడపకు వెళ్లిన జగన్ మోహన్ రెడ్డి పాలన పట్ల విశేష స్పందన కనపడుతుందన్నారు.ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే అధికారుల సమక్షంలో పరిష్కారం చూపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు నందేపు శ్రీనివాస్, పార్టీ శ్రేణులు, వార్డ్ ఇంచార్జులు, వివిధ విభాగాల కార్పోరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు