గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు జి. శ్రీనివాస్ నాయుడు
ఏపీ పబ్లిక్ న్యూస్ : తూర్పు గోదావరి జిల్లా
పెరవలి మండలం కాపవరం గ్రామంలో' గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు జి. శ్రీనివాస్ నాయుడు
పెరవలి మండలం కాపవరం గ్రామం నుండి రెండవ రోజు "గడప - గడపకు మన ప్రభుత్వం" అందిస్తున్న సంక్షేమ పథకాలను అధికారుల సమక్షంలో ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని తెలుసుకోవడమే కాకుండా వారి అవసరాలను గుర్తించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే జి.శ్రీనివాస్ నాయుడు ఈ సందర్భంగా తెలిపారు.
పెరవలి మండలం కాపవరం గ్రామంలో ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌నాయుడు గడపగడపకూ తిరుగుతూ. వృద్ధులు, అక్కాచెల్లెమ్మలు, యువతతో మాట్లాడారు. అన్నా.. రైతు భరోసా సాయం అందిందా.. అవ్వా, తాత పింఛన్ వస్తోందా.. ఆరోగ్యం బాగుందా.. అక్కా వైఎస్సార్ ఆసరా.. చేయూత.. అమ్మ ఒడి డబ్బులు పడ్డాయా అంటూ అప్యాయంగా పలకరించారు. ప్రజలను సమస్యలను తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ప్రతి ఇంటిలోనూ నవరత్నాల ద్వారా లబ్ధి పొందుతున్నట్లు ప్రజలు ఎమ్మెల్యే గారి, దృష్టికి తీసుకువచ్చారు. లబ్ధిదారులతో మాట్లాడుతూ గత ప్రభుత్వానికి ఇప్పుడు జగనన్న ప్రభుత్వానికి తేడా వివరిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి కులం,మతం, పార్టీలకు అతీతంగా పథకాలు అందిస్తున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేదని ఎమ్మెల్యే తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పెరవలి మండల ఎంపీపీ, వైస్ ఎంపీపీ, పెరవలి మండల జెడ్పీటీసీ, పెరవలి మండల అధ్యక్షులు, గ్రామ సర్పంచ్, ఎంపిటిసి, రాష్ట్ర డైరెక్టర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, పెరవలి మండల ఎం.డి.ఓ, వాలంటీర్స్, సచివాలయం సిబ్బంది మరియు హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు.