చిత్తూరు జిల్లా: మదనపల్లె :
మద్యం మత్తులో.... పొట్టేలు తల అనుకుని మనిషి తల నరికిన ఘనుడు
ఏపీ పబ్లిక్ న్యూస్ : చిత్తూరు జిల్లా
మదనపల్లె మండలంలో ఆదివారం అర్ధ రాత్రి పొట్టేలు అనుకుని ఓ యువకుని నరికేశాడు. మదనపల్లె మండలం వలసపల్లిలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా గ్రామస్తులు కనుమ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో ఊరి పొలిమేర ఉన్న గ్రామ దేవతకు జంతు బలి ఇచ్చే సమయంలో పొట్టేలుని పట్టుకుని ఉన్న తలారి లక్ష్మణ కుమారుడు తలారి సురేష్ (35) ను పొట్టేలు నరికే తలారి అయిన గంగన్న కుమారుడు చలపతి మద్యం మత్తులో పొట్టేలుని నరుకుతూ పొట్టేలు అనుకునే పొట్టేళ్లను పట్టుకుని ఉన్న సురేష్ తల నరికేశాడు. ఆ రక్తపు మడుగులో కుప్పకూలిన బాధితుని స్థానికులు హుటాహుటిన మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.