పాలకొల్లు స్వర్ణ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ కుట్టు మిషన్లు పంపిణీ

 


ఏపీ పబ్లిక్ న్యూస్ : పశ్చిమ గోదావరి జిల్లా  

పాలకొల్లు : స్వర్ణ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ తరగతులు నేర్చుకున్న మహిళలకు ప్రాధాన్యత సర్టిఫికెట్స్ మరియు సబ్సిడీ కుట్టు మిషన్లు పంపిణీ చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా పరిషత్ చైర్మన్      కౌరి శ్రీనివాస్...ముఖ్య అతిథులుగా విచ్చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ. స్వర్ణ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్   వారు . రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న శిక్షణ ఉపాధి కార్యక్రమాలు అభినందనీయమని.అన్నారు . మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అందించే పథకాలను సక్రమంగా  సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు మహిళల కోసం ఎంతగానో కృషి చేస్తున్నారని ప్రతి మహిళ కూడా ఒక మహిళా సాధికారత కావాలని రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న మహిళా అభ్యున్నతి అప్పుడే ఉంటుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో. వైఎస్ఆర్సిపి పార్టీ ఇంచార్జ్ నాయకులు ఏడ్ల తాతాజీ మాట్లాడుతూ ఎన్జీవో ఆర్గనైజేషన్ వారు చేపట్టిన కార్యక్రమాలను  అందిస్తున్నామని అన్నారు. 


మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరు ఉపాధి శిక్షణ  తీసుకోవాలని ఈ విధంగామహిళల పట్ల కృషి చేస్తున్న స్వర్ణ ఎన్జీవో వారిని అభినందించారు మరియు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ పెద్దిరాజు. మాట్లాడుతూ పాలకొల్లు పట్టణంలో  కుట్టు శిక్షణ లో మహిళలు సబ్సిడీ  మిషన్లు  తీసుకోవటం  ఎంతో సంతోషకరమనీ . వారు జీవనోపాధి కొరకు మహిళలు.ఏర్పాటు చేసుకున్న ప్రణాళికను NGO  వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అని అన్నారు. 

ఈ కార్యక్రమంలో నేషనల్ ఎన్జీవో డైరెక్టర్ స్వర్ణలత. మాట్లాడుతూమాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో అన్ని కులాల వారికి 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వరకు వసయసుకల్గిన  మహిళలకు బడుగు బలహీన వర్గాల మహిళలను గుర్తించి వారికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి వారికి యూనిట్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది అని శిక్షణ అనంతరం ప్రశంసా పత్రాలు  మరియు సబ్సిడీ ధరకు కుట్టు మిషన్లు ఇవ్వటం జరిగిందన్నారు. ప్రతి మహిళ ఒక మహిళా సాధికారత గా తీర్చిదిద్దడమేమా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపి  ఎన్జీవో అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ సత్య భామ  మాట్లాడుతూ మహిళల్లో చైతన్యం కలిగి ఉండాలని ప్రతి ఒక మహిళ కూడా తన తెలివితేటలతో తన  కుటుంబనికి  ఆర్థిక సహకారం అందించారని పేర్కొన్నారు. 

డిఫెండర్ ఎడ్యుకేషన్ సొసైటీ డైరెక్టర్ తోకల రాజేశం బాబు మాట్లాడుతూ  స్వర్ణ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో  చేపట్టిన మహిళ కుటీర శిక్షణ కార్యక్రమాలు అభినందించదగ్గవని అన్నారు.  ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి మహిళ తమ కాళ్ళమీద తాము నిలబడాలని కుటీర పరిశ్రమ ఏర్పాటు  చేసుకుని  ఆర్థికంగా ఎదగాలని అన్నారు   ఈ కార్యక్రమంలో టైలరింగ్ సెంటర్  టీచర్ మేరీ, రాజు, కుమారి తదితరులు పాల్గొన్నారు. 

ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన స్వర్ణ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ వారిని పలువురు  ఎన్జీవో డైరెక్టర్ లు  వైఎస్ఆర్ సీపీ  నాయకులు గ్రామస్తులు  అభినందించారు ఈ కార్యక్రమం. స్వర్ణ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగింది.

మహిళల పట్ల ఎంతో బాధ్యతగా పిలవగానే ఈ కార్యక్రమానికి విచ్చేసిన . వైఎస్ఆర్సిపి నాయకులకు జడ్పీ చైర్మన్ కౌరి  శ్రీనివాస్ గారికి  ఎన్జీవో డైరెక్టర్. స్వర్ణలత కృతజ్ఞతలు తెలియజేశారు.