నిడదవోలు : నిడదవోలు మండలం వ్యవసాయ సలహా మండలి మండల స్థాయి సమావేశము MPDO కార్యాలయంలో జరిగింది , ఈ కార్యక్రమంలో ఎంపీపీ తిరుమళ్ల భాగ్యలక్ష్మి, వైస్ ఎంపీపీ కె.ప్రభావతి, AMC చైర్మన్ వెలగన పోలయ్య , జడ్పీటీసీ కోయ్యే సూరిబాబు, మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కస్తూరి.సాగర్, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు ముళ్ళపూడి నరసింహారావు, వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకులు ముళ్ళపూడి శ్రీనివాస్ కుమార్ చౌదరి, మండల కమిటీ సభ్యులు, మండల వ్యవసాయాధికారి జి.సత్యనారాయణ, మరియు రైతులు పాల్గోన్నారు.
చర్చించిన అంశాలు.
1. ఎర్ర కాలువ గండ్లు వలన రైతులు పంట నష్ట పోతున్నారని, త్వరితగతిన గండ్లు పూడ్చమని కోరారు.
2. క్రాప్ ఇన్సూరెన్స్ ఖరీఫ్ 2020 సంబంధించిన ఇంకా రావాల్సిన మొత్తాన్ని త్వరితగతిన ఇచ్చే విధంగా చూడాలని కోరారు.
3. వ్యక్తిగతంగా వ్యవసాయ పనిముట్లు సబ్సిడీపై ఇవ్వాలని కోరారు.
4. ధాన్యం కొనుగోలు లో ఆన్లైన్ సమస్యలు పరిష్కరించాలని కోరారు