వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడుపకండి
ఈ నెల జరిగిన లోక్ అదాలత్ లో సహా మొత్తం మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 498 మందిని మంచిర్యాల కోర్టులో హాజరుపరచగా గౌరవ జడ్జిగారు వారికి తొమ్మిది లక్షల తొంభై ఆరు వేల( 9,96,000) రూపాయల జరిమానాలు విధించడం అయినది. మంచిర్యాల ట్రాఫిక్ సీఐ నరేష్ కుమార్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం మనకే కాకుండా అవతలి వ్యక్తులకు కూడా ప్రమాదకరమని, మందు తాగడం వలన వాహన చోదకులు విచక్షణ కోల్పోతారని, డ్రైవింగ్ యందు సరయిన తక్షణ నిర్ణయాలు తీసుకోలేక ప్రమదల బారిన పడే అవకాశం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మద్యం సేవించడం వాళ్ళ ప్రమాదం జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని, ప్రాణాలు కోల్పోతే కుటుంబ పోషణ లేక భార్య పిల్లలు అనాధాలు అవుతారని హితవు పలికారు. తిరిగి రెండవ సారి పట్టుబడితే శిక్షలు ఇంకా కఠినంగా ఉంటాయని పేర్కొన్నారు. కావున అందరూ గమనించి తమ కుటుంబ సభ్యుల కోసం అయినా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ తమ గమ్యస్థానాలకు క్షేమంగా చేరుకోవాలని కోరుకుంటున్నాం.
ఇట్లు,
K. నరేష్ కుమార్,
ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, మంచిర్యాల.