కర్నూల్ జిల్లా ఆదోని పట్టణంలోని అన్ని అర్బన్ హెల్త్ సెంటర్లలో సమస్యలు పరిష్కరించండి
ఏపీ పబ్లిక్ న్యూస్ : కర్నూలు జిల్లా
పట్టణంలో రెగ్యులర్ గా వైద్య అధికారుల పర్యవేక్షణ పెరగాలని, సీజన్ వ్యాధుల పట్ల ప్రజలకు చైతన్యం చేసి అనారోగ్య నికి గురికాకుండా కాపాడాలని DYFI అధ్యక్ష, కార్యదర్సులు వీరేష్, నాగరాజు లు పాదయాత్ర సందర్భంగా 7,8,5,3,19,20,21,26,18,12,16,17,12,15,13,10, వార్డ్ సచివాలయల ANM లకు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ అర్బన్ సెంటర్ల లో మెరుగైన వైద్యం కోసం కనీస మెడికల్ కిట్లు, పరికరాలు వెంటనే ఉన్నత వైద్య అధికారులతో మాట్లాడి ఏర్పాట్లు చేయాలని, గర్భిణీలకు నిరంతరం పరీక్ష లు జరిపి, రెగ్యులర్ గా సీజరిన్ ఆపరేషన్ లు చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో DYFI పట్టణ నాయకులు సతీష్,శ్రీకాంత్, మోహన్, గణేష్ తదితరులు పాల్గొన్నారు