బాలికల కుస్తీ పోటీలో కోరాడ శారద కు బంగారు పతకం

కోరాడ శారద కు బంగారు పతకం.....

భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి పాఠశాలకు పేరు తేవాలి......

పెద్దపాడు ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని  టీ .అమరవాణి.......


ఏపీ పబ్లిక్ న్యూస్ : శ్రీకాకుళం జిల్లా

శ్రీకాకుళం గ్రామీణ మండలం: శ్రీకాకుళం గ్రామీణ మండలం లో గల పెద్దపాడు ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్న  కోరాడ శారద గత నెల  నవంబర్లో  గుంటూరు  జిల్లా పేరేచర్ల గ్రామంలో ఆంధ్ర ప్రదేశ్ కుస్తీ పోటీల అసోసియేషన్ నిర్వహించిన బాలికల కుస్తీ పోటీలో ఆమె 46 కేజీల వ్యక్తిగత విభాగంలో అండర్ 15 సంవత్సరముల కేటగిరిలో పోటీల్లో పాల్గొని ప్రథమ స్థానం కైవసం చేసుకునే బంగారు పతకం సాధించింది, అనంతరం  ఆమె త్వరలో జరగనున్న జాతీయ స్థాయి బాలికల కుస్తీ పోటీలకు  ఎంపిక అయ్యింది, ఈమె సాధించిన విజయం పట్ల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయిని అయినా టీ .అమరవాణి , పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు అయినా ఎం. శ్రీనివాసరావు, ఎస్. లలితా శివ జ్యోతి, ఎం. శాంతారావు, ఏ .మాధవి భాయ్, పీవీ.  గీతాలక్ష్మి, జె. లలిత , జి. భూషన్ రావు, డి .యమ్. మల్లేశ్వరి, వి. ఉమారాణి, ఇదే పాఠశాలలో పని చేస్తున్నా వ్యాయామ ఉపాధ్యాయులు అయినా షేక్. ఫాతిమా బేగం, డాక్టర్. గుండబాల .మోహన్, ఆర్ట్, క్రాఫ్ట్ ఉపాధ్యాయులు అయినా సిహెచ్. రవి కుమార్, బి. త్రివేణి, శ్రీకాకుళం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కుస్తీ  ఆటల కోచ్ అయినా బి. గోవిందరావు, గ్రామ పెద్దలు ఆమెకు ప్రత్యేకంగా అభినందించారు.