ఫలించిన ప్రభుత్వ విప్ చిర్ల కృషి
ఏపీ పబ్లిక్ న్యూస్ : తూర్పు గోదావరి జిల్లా
కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంనకు భక్తుల తాకిడి రోజు రోజుకు పెరుగుతున్న దృష్ట్యా భక్తుల సౌకర్యార్థం నిర్మించ తలచిన పిల్గ్రిమ్స్ ఎమినిటీస్ కాంప్లెక్స్ కొరకు ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి అభ్యర్ధన మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం నిధుల నుండి 2 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ జి.ఓ విడుదల చేయడం జరిగింది.
ఈ సందర్భంగా అతి త్వరలోనే ఈ భవనం నిర్మాణ పనులు ప్రారంభించి పూర్తి చేస్తామని అలాగే వాడపల్లి అభివృద్ధికి రూపొందించిన మాస్టర్ ప్లాన్ కొరకు ప్రతిపాదనలు పంపించడం జరిగింది అని ఒక్కొక్కటిగా చేసుకుంటూ వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్ మరియు చిర్ల జగ్గిరెడ్డి తెలియచేసారు.