రుణాలు(లోన్స్) ఇప్పిస్తామంటూ మోసాలు... సైబర్ నేరగాళ్ళతో జాగ్రత్త :- కర్నూలు జిల్లా ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి IPS
ఏపీ పబ్లిక్ న్యూస్ : కర్నూలు జిల్లా
మోసగాళ్ళు మీకు ఒక నోటిఫికేషన్ రూపంలో లేదా ఒక మెసేజ్ రూపంలో రుణ (లోన్) సౌకర్యం కల్పిస్తామని , రుణం కావాల్సిన వారు ఈ నెంబర్ ను సంప్రదించగలరు అంటూ ఒక నెంబర్ ను పంపుతారు , ఒకవేళ మీకు నిజంగానే అవసరం ఉంటే కనుక మీరు ఆ నెంబర్ ను సంప్రదించినట్లయితే మొదటగా లోన్ కొరకు 1% ప్రోసెసింగ్ ఫీజు, రెండవ సారి 2% డాక్యుమెంట్ వెరీఫికేషన్ ఫీజు, మూడవ సారి 3% సెక్యూరిటీ డిపాజిట్ ఫీజు లు ధపాలుగా కట్టాలని చెబుతారు. ఇటువంటి మోసాగాళ్ళ బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ తెలిపారు.
డిపాజిట్ ఫీజులను కట్టిన పిమ్మట మీరు కట్టిన డబ్బును కేవలం ఫార్మాలిటీ కొరకు కట్టించుకున్నాo, మీరు కట్టిన డబ్బును మీ లోన్ తో పాటు మొత్తం ఇస్తాం అని నమ్మించి కొన్ని రోజులకి సెల్ ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేసుకుంటారు. ఈ విధంగా సైబర్ నేరగాళ్ళు కొత్త పద్ధతిలో నేరాలకు పాల్పడుతున్నారు.
ఈ తరహా మోసాలతో సైబర్ నేరగాళ్ళు కర్నూల్ కు చెందిన పలువురిని మోసాలు చేయడం జరిగినది. మొదటగా ప్రొసెసింగ్ ఫీజు కింద కొంత మొత్తం , డాక్యుమెంట్ వెరిఫికేషన్ , సెక్యూరిటీ డిపాజిట్ కింద కొంత మొత్తాలను వివిధ పర్యాయలలో వ్యక్తుల నుండి డబ్బులను వారి ఖాతాలకు వేయించుకుని మోసాలకు పాల్పడ్డారు
ఏమైనా సమస్యలుంటే స్ధానిక పోలీసు స్టేషన్ లో గాని, సైబర్ ల్యాబ్ పోలీసులకు గాని లేదా సైబర్ మిత్ర వాట్సప్ నెం. 9121211100 కు గాని లేదా cybercrime.gov.in లేదా టోల్ ఫ్రీ సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ 155260 ను సంప్రదించి ఫిర్యాదు చేయండి