ఏపీ పబ్లిక్ న్యూస్ : అమరావతి
అసెంబ్లీ సమావేశాల్లో మహిళా సాధికారతపై చర్చలో భాగంగా సీఎం జగన్ మాట్లాడుతూ..
మహిళా సాధికారతపై చర్చకు చంద్రబాబు వస్తారేమో అని అనుకున్నాం.
ఆలస్యం చేసినా ఇంతవరకు రాలేదు. కుప్పం ఎఫెక్ట్‌తో చంద్రబాబు రాలేదని మావాళ్లు అంటున్నారు.
అక్కాచెల్లెమ్మలకు మంచి చేసే ప్రభుత్వం మాది. అమ్మ ఒడి పథకం ద్వారా వారికి అండగా నిలుస్తున్నాం.
రాష్ట్రంలో 61 లక్షా 73 వేల పెన్షన్లు అందిస్తున్నాం. అందులో 36 లక్షల 70వేల మంది మహిళలకు పెన్షన్ ఇస్తున్పాం. నెలకు రూ. 1500 కోట్లకు పైగా పెన్షన్లకు ఖర్చు చేస్తున్నాం. సూర్యోదయం కంటే ముందే పెన్షన్లు అందిస్తున్నాం. గతంలో ఎన్నికలకు ముందే పథకాలు అమలయ్యాయి.
'అక్కాచెల్లెమ్మలను ఆదుకునేందుకు వైఎస్సార్ ఆసరా పథకం తీసుకొచ్చాం. అదనపు ఆదాయం పొందేలా వ్యాపారాలకు ప్రోత్సాహకాలు ఇచ్చాము. 3.40 లక్షల మందికి ఉపాధి అవకాశాలు చూపించాం. 31 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇచ్చాం.
ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణాలను కోర్టులకు వెళ్లి, కేసులు వేసి ఆపాలని చూశారు. మంచి పథకాలు ఆపాలని చూడటం ధర్మమేనా?. అందుకే కుప్పంలో జనం మొట్టికాయలు వేశారు.
సున్నా వడ్డీ పథకం ద్వారా కోటి మంది మహిళలకు లబ్ధి చేకూర్చాం. వైఎస్సార్ చేయూత ద్వారా 24.56 లక్షల మందికి రూ.8,944 కోట్లు ఇచ్చాం' అని సీఎం జగన్ అన్నారు.