ఏపీ పబ్లిక్ న్యూస్ : నిడదవోలు : పశ్చిమ గోదావరి జిల్లా
జై భీమ్ చిత్రం నిమ్నజాతుల ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీక, కొనసాగుతున్న అసమానతలు, అంటరానితనం, కులవివక్ష. అంటరాని వాళ్లపై రాజ్యహింసకు నిలువుటెద్దు సాక్ష్యం!నిడదవోలులో కూడా పోలీసులచిత్రహింసలకు బలైన మరో రాజకన్ను*మాదాసు నాగభూషణం*అప్పుడు మాదాసు కుటుంబానికి సీపీఎం SFI. దళిత మహాసభలు అండగా న్యాయం కోసం పోరాటం!.జువ్వల రాంబాబు....✊జైభీమ్ చిత్రం ఒక అణువిస్ఫోటనం. ప్రజాకళలు ఎంత శక్తివంతమైన వో ఒకప్పుడు ప్రజా కళాకారుడు సఫ్ధర్ హష్మీ వీధినాటికలు. సీ.ఉమామహేశ్వరరావు నిర్మించిన రేవతి-సిరివెన్నెల సీతారామశాస్త్రి నటించిన అంకురం సినిమాలు ప్రకంపనలు, జైభీమ్ చిత్రం నాకు తెలిసినంతవరకు అన్ని వర్గాలనుండి ఈ సినిమా కు వచ్చినంత స్పందన మరే ఏ సినిమా కు రాలేదు అద్భుతం! పేదోడు ఉన్నోడు దళిత, ఆధిపత్య కులాలు అందరూ జైభీమ్ సూపర్ అంటుంటే ఆశ్చర్యం కలిగిస్తుంది, బహుశా మనదేశంలో పోలీస్ వ్యవస్థకోర్టుల పై ఉన్న అభిప్రాయం కావొచ్చు! జైభీమ్ యదార్థఘటన ఆధారంగా తీసిన సినిమా అవ్వటం వలన. ఆదిమ తెగ ఇరుల జాతికి చెందిన రాజకన్ను & కుటుంబ సభ్యులను పోలీసులు పెట్టిన చిత్ర హింసలు పరిశీలిస్తే, ప్రముఖ మేధావి. మాజీ సుప్రీంకోర్టు న్యాయవాది VR కృష్ణయ్యర్ పౌరహక్కుల ఉల్లంఘన కేసులో వాదిస్తూ "పోలీసులుlicensed gundaas" అని ఘాటుగా వ్యాఖ్యానించారు. నిజంకూడా, సమాజంలో ప్రతివిభాగంలో మంచి చెడురెండూ ఉంటాయి మంచిపోలీసులు మంచి న్యాయవాదులు వుంటారు. అమ్ముడుపోయేవారు వుంటారు MP టికెట్ ఇస్తామని హైకోర్టు లో ప్రభుత్వం తరపున ప్రలోభ పెట్టడం పోలీసులకు ప్రమోషన్ ఎర చూపటం లాంటివి ఇప్పటికి జరుగుతున్నవే, ఇందులో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం రాజ్యాంగ బద్ధంగా ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదో చక్కగా వివరించారు దిక్కు మొక్కు లేని గిరిజన యువతి తనకు ఈ దేశపు చట్టాలు న్యాయం పై నమ్మకం ఉందని నాకు న్యాయం కావాలని ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఆత్మగౌరవ పోరాటానికి నాంది పలికింది.
ఏదైనా అన్యాయం జరిగితే దానిని రాజీచేసి పబ్బం గడుపుకుంటున్న కొంతమంది తాబేదార్లకు, బ్రోకర్లకు ఈ సినిమా చెప్పుదెబ్బ లాంటిది, బాధితులకు జరగని న్యాయం, వారికి జరిగిన అన్యాయం కంటే తీవ్రమైనది అని కోర్టులో వాదించిన న్యాయవాది పవర్ ఫుల్ పంచ్ సమాజానికి మేలుకొలుపులాంటిది! 1993 నేను SFI కార్యకర్తగా పనిచేస్తూ BL చదువుతున్న సమయంలో నిడదవోలు లో మాదాసు నాగభూషణం అనే దళిత యువకుడ్ని దొంగతనం చేశాడని అనుమానంతో నిడదవోలు పోలీస్ సర్కిల్ కార్యాలయంనుండి పోలీసులు మాదాసు నాగభూషణాన్ని తీసుకొచ్చి సర్కిల్ కార్యాలయంలో నిర్బంధించారు అప్పట్లో నిడదవోలు పోలీసు సర్కిల్. కార్యాలయం నిడదవోలు గణపతి సినిమా హాల్ ఎదురుగా ఉన్నవీధిలో అద్దెభవనంలో ఉండేది బసవ పూర్ణయ్య సర్కిల్ ఇన్స్పెక్టర్ మాదాసు నాగభూషణాన్ని తీవ్రంగా కొట్టడంతో పోలీసుల కస్టడీలో చనిపోయాడు, తెల్లవారుజామున ప్రస్తుతం కొత్తపల్లి స్వీట్స్ షాప్ ఎదురుగా ఉన్న ఒక అరుగు మీద పోలీసులు పడుకోబెట్టి ప్రక్కనే పురుగుల మందు డబ్బా పెట్టి తప్పుకున్నారు.
అదే సమయంలో ఒక రిక్షా కార్మికుడు గమనించి నేనుబస్ స్టాండ్ సెంటర్ లో టీ తాగుతుండగా సమాచారం అందించారు, నేను వెంటనే సీపీఎం. దళిత మహాసభ నాయకులు పిల్లి డేవిడ్ కుమార్ గారికి సమాచారం అందించాను! ఆ ఉదయమే CI బసవ పూర్ణయ్య నన్ను స్టేషన్ కి పిలిపించారు మొదట నన్ను బెదిరించారు. ప్రలోభ పెట్టారు నేను ఎదుర్కొన్నాను నన్ను పిస్టల్ చూపించి భయపెట్టాడు నేను మరో భగత్ సింగ్ లా నిలబడ్డాను. ఇంతలో SI రమేష్ నాయుడు అనుకుంటా నన్ను బయటకు తీసుకుపోయారు ఆసమయంలో ప్రముఖ మార్క్సిస్టు మేధావి సీపీఎం నాయకులు మంతెన సీతారాంకి సమాచారం ఇచ్చాను. ఆయన నిడదవోలు వచ్చి ఉద్యమానికి ఊతం ఇచ్చి CI బసవ పూర్ణయ్య కు గట్టిగా హెచ్చరించారు 6నెలలు ఉద్యమం నడిపాము ఆ సమయంలో మాకు వ్యతిరేకంగా పట్టణంలో ఒక ఆధిపత్య కులానికి చెందిన వారు కొంతమంది బ్రోకర్లు. రాజకీయ నాయకుల అండతో CI కి అనుకూలం గా కౌంటర్ ఉద్యమం చేశారు. మేము చేసిన ఉద్యమంతో ప్రభుత్వం మెజిస్టీరియల్ దర్యాప్తు కు ప్రభుత్వం ఆదేశించింది ఇలాంటి దుర్మార్గాలు జరిగినప్పుడు కమ్యూనిస్టులే అండగా వుంటారనేది నా అనుభవమే! కొంతమంది కమ్యూనిస్టులకు కులం ఆపాదించి, ఆధిపత్య కులాల వారి దగ్గర పంచన చేరి దళితులకు అన్యాయం చేస్తారు.
అప్పట్లోనే కమ్యూనిస్టులు దళితుల పక్షాన ఎలా నిబద్ధతతో నిలబడతారో మరో సంఘటన పశ్చిమగోదావరి జిల్లా పిప్పర గ్రామంలో అగ్ర కులాలు దళితులపై దాడులు. సాంఘిక బహిష్కరణ చేస్తే సీపీఎం నాయకులు మంతెన సీతారాం పచ్చిపులుసు గోవింద్ దళితులకు అండగా ఉన్నారని వారిపై దొంగతనం నేరం మోపి అగ్ర కులాలు వారు చెట్టుకు కట్టేసి చిత్రహింసలకు గురిచేశారు! ఈ సినిమా ప్రేరణ అయిన జస్టీస్ చంద్రు మార్క్సిస్టు ఆ ప్రేరణ తో అంబేద్కర్ రచనలు చదివి రాజ్యాంగ గొప్పతనాన్ని అర్ధం చేసుకుని న్యాయం వైపు నిబడ్డాడు అందుకే. జైభీమ్ అని పేరు పెట్టారు.
దర్శకుడు జ్ఙాన్ వేల్ సత్యాన్ని విస్మరించకుండా సినిమాని తీసి తనలోని పోరాట యోధుడ్ని బయటకు తీసుకొచ్చాడు. జ్ఙాన్ వేల్ మీకు నీల్ లాల్ సలాం✊✊✊నటులు కొంతమంది ని మినహాయిస్తే. మిగిలినవారు ఇరుల జాతి ప్రజల్ని నటింప చేసారేమో అని అనుకున్నాను. తరువాత వాళ్ళుకూడా నటులే అని తెలిసి ఆశ్చర్యం. వాళ్ళ నటన ఎలావుందంటే. సహజత్వమే ఈర్ష్య పడేలా ఉంది!జువ్వల రాంబాబు