విద్యపై పాలకులకు చిత్తశుద్ది లేదు - ప్రో. లక్ష్మినారాయణ


ఏపీ పబ్లిక్ న్యూస్ - ఖమ్మం జిల్లా

బీజేపీ అధికారం చేపట్టిన నాటి నుండి మనుషులలో దేశభక్తి పేరుతో ద్వేషం నింపడం పనిగా పెట్టుకుందని ప్రో. లక్ష్మీనారాయణ అన్నారు. మూడో రోజు పి.డి.ఎస్.యు రాష్ట్ర రాజకీయ శిక్షణా తరగతులలో "విద్యా కాషాయీకరణ" అంశంపై మాట్లాడారు. దీనికి పి.డి.ఎస్.యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. నాగేశ్వర రావు అధ్యక్షత వహించారు. 


విద్యారంగం లోకి కూడా మతాన్ని చొప్పించే ప్రయత్నంలో భాగంగా నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చిందని అన్నారు. దీనిలో సెక్యులర్ అన్న పదానికే చోటు ఇవ్వలేదన్నారు. భారత దేశమంటేనే విభిన్న మతాల కలయిక గల సెక్యులర్ దేశమన్నారు. కానీ మత విభజన రాజకీయం చేస్తోందని, విద్యార్థులు అర్థం చేసుకుని పోరాడాలన్నారు. విద్యారంగానికి  కేంద్రంలో, రాష్ట్రంలో పాలకులు బడ్జెట్ లో ప్రతీ ఏడాది తగ్గిస్తున్నారని, ఈ పాలకులు తోడు దొంగలన్నారు.


తొలుత జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులను సి.పి.ఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పి.రంగారావు క్లాస్ బోధించారు. దీనికి పి.డి.ఎస్.యు రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దింటి రామకృష్ణ అధ్యక్షత వహించారు. విద్యార్థులు చదువుతో పాటు ప్రపంచంలో అన్ని విషయాలు తెలుసుకోవాలన్నారు. 

ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శి జూపాక శ్రీనివాస్, బోయిన్ పల్లి రాము, ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులు సాగర్, కల్పన, పి. మహేష్, శరత్,  నాయకులు పృథ్వి, శ్రీకాంత్, గౌతం, ఆజాద్, స్వాతి, చరణ్, వినోద్, తదితరులు పాల్గొన్నారు.