కుడుపూడి పట్టాభి జగదాంబ మెమోరియల్ ట్రస్టును ప్రారంభించిన ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి


ఏపీ పబ్లిక్ న్యూస్ : తూర్పు గోదావరి జిల్లా

కుడుపూడి పట్టాభి జగదాంబ మెమోరియల్ ట్రస్టును ప్రారంభించిన ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి

ఆత్రేయపురం మండలం పులిదిండి గ్రామంలో ఏర్పాటు చేసిన శ్రీమతి & శ్రీ కుడుపూడి పట్టాభి జగదాంబ మెమోరియల్ ట్రస్టును ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా చిర్ల మాట్లాడుతూ కుడుపూడి పట్టాభి గారితో ఆయనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులను పంచుకోవాలని చూసే కొడుకులు ఉన్న ఈ కాలంలో వారి ఆశయాలు కూడా పంచుకోవాలని తెలియచేస్తూ కుడుపూడి పట్టాభి జగదాంబ పెరు మీద ట్రస్టును ఏర్పాటు చేసిన కుటుంబసభ్యులను అభినందించారు.