ఏపీ పబ్లిక్ న్యూస్ : ప్రకాశం జిల్లా
గిద్దలూరు పట్టణంలోని స్థానిక కోటగడ్డ వీధి లో కోట స్కూల్ నందు మహనీయుడు, స్వాతంత్ర్య సమర యోధుడు, మొట్ట మొదటి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి మెగా మెడికల్స్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా కౌన్సిలర్ ముద్దర్ల.లక్ష్మీదేవి, శ్రీనివాసులు, కృష్ణంశెట్టి పల్లె ప్రాథమిక వైద్యులు డాక్టర్ నాయబ్ రసూల్ పూల మాలలతో ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ముద్దర్ల .శ్రీనివాసులు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరంలో చురుకుగా పాల్గొని ఖిలాఫత్ ఉద్యమం, సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో భాగస్వాములయ్యారని, దాదాపు 10 సంవత్సరాలపాటు జైలుశిక్షను కూడా అనుభవించారని, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రిగా 11 ఏళ్లపాటు పనిచేశారని, విద్యారంగానికి మౌలానా చేసిన సేవలకు గుర్తుగా ఆయన జయంతి అయిన నవంబర్ 11ను జాతీయ విద్యా దినోత్సవంగా మరియు మైనార్టీ సంక్షేమ దినోత్సవంగా కూడా జరుపుకుంటామని, మౌలానా అబుల్ కలాం మహానుభావుడి ఆదర్శాలను నేటి విద్యార్థులు అనుసరించాల్సిన అవసరం ఉందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సయ్యద్. అజీమ్ బాషా, షేక్.ఖాజా హుస్సేన్, అబ్దుల్ రహిమాన్, హెడ్ మాస్టర్ ఆవుల రాజు, టీచర్ రమేష్, రామకృష్ణ , మూల వెంకట వినీత్, ఇస్మాయిల్, మల్లాపురం సాగర్ తదితరులు పాల్గొన్నారు.