గ్యాస్ వినియోగదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్..!
ఏపీ పబ్లిక్ న్యూస్
ఆకాశమే హద్దుగా పెరిగిన ఇంధన ధరలపై కేంద్రం ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడంతో సామాన్యులకు కాస్త ఉపశమనం తగ్గింది. పెట్రోల్‌పై రూ. 5, డీజిల్‌పై రూ. 10 చొప్పున తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఎల్‌పీజీ సిలిండర్లపై మరో అనూహ్య నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఎల్‌పీజీ సిలిండర్లపై భారీ రాయితీ..!
ఇంధన ధరలతో పాటుగా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగానే పెరిగాయి. కొన్ని ప్రాంతాల్లో డొమెస్టిక్ గ్యాస్ ధర ఏకంగా రూ.1000కు చేరువైంది. దాంతో పాటుగా గ్యాస్ సిలిండర్లపై కేంద్రం సబ్సిడీను కూడా భారీగా తగ్గించింది. ప్రస్తుతం ఆయా ప్రాంతాలను బట్టి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల కొనుగోలుపై సుమారు రూ.20 నుంచి రూ. 40 వరకు మాత్రమే సబ్సిడీని పొందుతున్నారు. గ్యాస్ సిలిండర్లపై ధరల పెంపుతో సామాన్య ప్రజలపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఇచ్చే మినహాయింపును పెంచాలని భావిస్తోన్నట్లు తెలుస్తోంది.
డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్‌పై రూ.312.48కి సబ్సీడి అందించాలని తెలుస్తోంది.