ఏపీ పబ్లిక్ న్యూస్
పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు ఒక కేసు విషయం గా మాట్లాడడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన మహిళా న్యాయవాదిపై నిడదవోలు సీఐ k. a స్వామి అనుచిత ప్రవర్తన అనుచిత వ్యాఖ్యలతో తనను అవమానించారని అంతేకాకుండా గత రెండు నెలలుగా తనను హెరాస్మెంట్ కు గురి చేస్తున్నట్లు ఆమె ఆరోపించారు..
ఈవిషయంపై స్పందించిన నిడదవోలు బార్ అసోసియేషన్ న్యాయవాదులు ఆమెకు బాసటగా నిలిచారు.. తమ విధులను బహిష్కరించి నిడదవోలు సిఐ k. a స్వామి పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిడదవోలు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఎదుట ధర్నా నిర్వహించారు.