జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఘనంగా బాలల దినోత్సవం - రాజమహేంద్రవరం



ఏపీ పబ్లిక్ న్యూస్ : తూర్పు గోదావరి జిల్లా

రాజమహేంద్రవరం స్థానిక జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల పిడింగొయ్యి నందు జవహర్ లాల్ నెహ్రు జయంతిని పురాష్కరించు కొని బాలల దినోత్సవం కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.సుజాత పాల్గొని నెహ్రు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈకార్యక్రమంలో విద్యార్థులు ను ఉద్దేశించి నెహ్రు కు పిల్లలతో వున్నా భాంధవ్యాన్ని తెలుపుతూ ప్రసంగించారు.పాఠశాల లో పోటీలు నిర్వహించి విజేతలు అయినా విద్యార్థులు కు బహుమతులు అందచేసి, మిఠాయిలు అందచేశారు. ఈకార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గున్నారు.