రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్ - జనరల్ టికెట్ ధరకే ఏసీ ప్రయాణం


ఏపీ పబ్లిక్ న్యూస్ : జాతీయం

జనరల్ టికెట్ ధరకే ఏసీ ప్రయాణాన్ని (AC Coach) అందించేందుకు భారతీయ రైల్వే కసరత్తు చేస్తోంది.            

ఇందుకోసం ఏం చేయబో తోందో తెలుసుకోండి.

1. భారతీయ రైల్వే జనరల్ బోగీలను ఏసీ కోచ్‌లుగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. 

ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లల్లో బోగీలన్నీ ఏసీ కోచ్‌లు ఉండబోతున్నాయి. 

ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడం కోసం రైల్వే ఈ మార్పు చేయబోతోంది.            

ఏసీ జనరల్ క్లాస్ కోచ్‌ల (AC General Class coach) పేరుతో కొత్త బోగీలను పరిచయం చేయనుంది. 

2. రైళ్లల్లో జనరల్ బోగీలతో పాటు స్లీపర్, థర్డ్ ఏసీ,సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ బోగీలు ఉంటాయి. 

అయితే త్వరలో దూర ప్రాంతాల రైళ్లల్లో బోగీలన్నీ ఏసీవే ఉంటాయి.          

థర్డ్ ఏసీ,సెకండ్ ఏసీ,ఫస్ట్ ఏసీతో పాటు ఏసీ జనరల్ క్లాస్ కోచ్‌లు (AC General Class coach) ఉంటాయి.

3. ఏసీ జనరల్ క్లాస్ కోచ్‌లో 100 నుంచి 200 మంది ప్రయాణికులు కూర్చోవచ్చు.ఈ బోగీల్లో టికెట్ ధరలు ప్రస్తుతం జనరల్ టికెట్ ధరలతో సమానంగా లేదా కాస్త ఎక్కువగా ఉంటాయి. 

తక్కువ ధర టికెట్‌తో ఏసీ ప్రయాణం ఆస్వాదిం చేందుకు ఈ కోచ్‌లు ఉపయోగ పడతాయి. 

4. పంజాబ్‌లోని కపుర్తలాలో ఉన్న రైల్ కోచ్ ఫ్యాక్టరీలో ఏసీ జనరల్ క్లాస్ కోచ్‌లు తయారు కానున్నాయి.                

కొత్త ఏసీ బోగీల్లో సీట్లన్నీ రిజర్వ్‌డ్ సీట్లే ఉంటాయి. ఆటోమెటిక్‌గా తెరుచుకునే,మూసుకునే డోర్స్ ఉంటాయి.

5. సాధారణంగా జనరల్ కోచ్‌లు అన్‌రిజర్వ్‌డ్‌గా ఉంటాయి.కానీ కరోనా వైరస్ మహమ్మారి తర్వాత వీటిని రిజర్వ్‌డ్ కోచ్‌లుగా మార్చారు. ఇక ఇటీవల ఏసీ ఎకనమీ కంపార్ట్‌మెంట్స్‌ని రైల్వే ఆవిష్కరించింది. వీటిలో టికెట్ ధరలు థర్డ్ ఏసీ టికెట్ కన్నా తక్కువగా ఉంటాయి. స్లీపర్ ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని ఈ బోగీలను రూపొందించింది రైల్వే. 

6. నార్త్ సెంట్రల్ రైల్వే పరిధిలోని ప్రయాగ్‌రాజ్-జైపూర్ రైలులో ఏసీ ఎకనమీ కోచ్‌లు ఏర్పాటు చేసింది. 

రైల్వే స్లీపర్ క్లాస్ ప్రయాణికులు కాస్త ఎక్కువ ధర చెల్లించి ఏసీ ప్రయాణాన్ని ఆస్వాదించొచ్చు.     

ఎకనమీ క్లాస్ ఏసీ కోచ్‌ల టికెట్ ధరలు థర్డ్ ఏసీ టికెట్ కన్నా 8 శాతం తక్కువగా ఉంటాయి. 

7. ఇక భారతీయ రైల్వే కోవిడ్ కన్నా ముందు ఉన్నట్టుగా రైల్వే సేవల్ని పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.దీంతో మరి కొన్ని రోజుల్లో 1700 రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.                 

ఇక కోవిడ్ స్పెషల్ రైళ్లు ఉండవు. టికెట్ ధరలు కూడా తగ్గనున్నాయి.