ఏపీ పబ్లిక్ న్యూస్ : రంగారెడ్డి జిల్లా
ఇటీవల తాండూరు పట్టణ శివారులో రాత్రి వేళ ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో ఒకరు మరణించారు..ఇద్దరు గాయపడ్డారు. దీనిని అంతా రోడ్డు ప్రమాదంగా భావించారు.
అయితే తాండూరు డివిజన్‌లోని తాండూరు గ్రామీణ పోలీసుల సాగించిన దర్యాప్తుతో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. రేషన్ బియ్యం అక్రమ రవాణాలో ఇద్దరు వ్యక్తుల మధ్య వచ్చిన స్పర్థలు రోడ్డు ప్రమాదంకు కారణంగా పోలీసులు తేల్చారు. ఒకరు కక్ష కట్టి మరొకరిని చంపేందుకు పథకం రచించినట్లు తాండూరు గ్రామీణ పోలీసులు గుర్తించారు. ఈ కేసును గంటల వ్యవధిలోనే ముగించారు.
అంతకు ముందు వికారాబాద్ డివిజన్ పరిధిలోని మోమిన్‌పేట్ సర్కిల్ పరిధిలో ఒక ఆలయంలో దొంగతనం జరిగింది. ఈ కేసులో కూడా పోలీసులు గంటల వ్యవధిలోనే దొంగలను పట్టుకోవడంతో పాటు ఆభరణాలను రికవరీ చేశారు. ఇంతగా జిల్లాలోని పోలీసు అధికారులు కేసుల చేధనలో రాటు తేలడం వెనుక జిల్లా ఎస్పీ నారాయణ నిత్యం ఇస్తున్న శిక్షణ తోడ్పాటును అందిస్తోంది.