ఏపీ పబ్లిక్ న్యూస్ : అమరావతి
ఏపీలో నేడు 36 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగుతున్నాయి రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఇదివరకే ముగిసినా కొన్ని కారణాల వల్ల పలు చోట్ల ఎన్నికలు నిలిచిపోయాయి.
దాంతో వీటిన్నింటికీ ఇప్పుడు ఒకేసారి ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం 350 పోలింగ్ కేంద్రాల్లో పంచాయితీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికకు పోలింగ్ నిర్వహించనున్నట్టు ఎస్ఈసీ గుతున్నాయి స్పష్టం చేసింది. ఉదయం 7 గంటల నుంచి మద్యాహ్నం 1 గంట వరకూ పోలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. అనంతరం మద్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు.
అలాగే రేపు నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు 12 మున్సిపాల్టీలకు ఎన్నికలు జరుగుతాయి. 17న వాటి కౌంటింగ్ ఉంటుంది. అలాగే ఎల్లుండి 15 జెడ్పీటీసీ స్థానాలకు, 187 ఎంపీటీసీల స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. వాటి ఓట్ల లెక్కింపు 18న నిర్వహిస్తారు.